తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల భాగంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిమిత్తం మధ్యాహ్నం ఆయన ఎర్రవల్లిలోని తన ఫార్మ్హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.
ఇంతవరకు ఆయన ఆరోగ్య పరిస్థితి సర్వసాధారణంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కేసీఆర్ ఆసుపత్రి నుంచి తిరిగి ఎర్రవల్లికి చేరుకున్నారు.
Read More : రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ సవాల్

One thought on “హైదరాబాద్లో కేసీఆర్కు వైద్య పరీక్షలు”
Comments are closed.