ఒడిశాలోని రాయగడ జిల్లాలో శ్రద్ధ కలిగించే అవమానకర ఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్ పంచాయతీలోని ఓ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న యువతిపై గ్రామ పెద్దలు కఠిన చర్యలు తీసుకున్నారు.
షెడ్యూల్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆదివాసీ యువతిపై కుటుంబ సభ్యులు మొదటి నుంచి అభ్యంతరం తెలిపారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యుల ఒప్పందం లేకుండా ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకుని తిరిగి గ్రామానికి చేరుకుంది.
ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు, గ్రామ కట్టుబాట్ల పేరుతో యువతి కుటుంబ సభ్యులపై శిక్ష విధించారు. గ్రామం నుండి వెలివేతను నివారించేందుకు యువతి కుటుంబానికి చెందిన 40 మంది శిరోముండనం చేసి, మూగజీవాలను బలిచేసి, ప్రేమ జంటకు పెద్దకర్మ చేశారు.
ఈ విషయంలో స్పందించిన పోలీసులు తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.
Read More : విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

One thought on “ఒడిశాలో కులాంతర వివాహం పై గ్రామ పెద్దల అవమానకర చర్య”
Comments are closed.