అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిన్న చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుండి నేరుగా మేఘానీనగర్‌లోని ప్రమాద ప్రాంతానికి వెళ్లిన ప్రధానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తోడుగా ఉన్నారు.
అక్కడ అధికారులు ప్రమాద ఘటన, సహాయక చర్యల పురోగతి గురించి ప్రధానికి సమగ్ర వివరాలు అందించారు. అనంతరం ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేశ్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద తెలుసుకున్నారు.
ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మోదీ ఇప్పటికే స్పందించారు. “ఈ విషాదం మాటలకు అందని వేదనను కలిగిస్తోంది. బాధితుల కుటుంబాలందరిపైనా నా ఆలోచనలు ఉన్నాయి. మంత్రులు, అధికారులు సహాయక చర్యలను సమీక్షిస్తూ అవసరమైన సాయం అందిస్తున్నారు” అని ప్రధాని తెలిపారు.
Read More : డెలివరీ బాయ్స్ కోసం తమిళనాడులో ఏసీ విశ్రాంతి కేంద్రాలు

One thought on “విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ”
Comments are closed.