తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పైలట్

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ బాధ్యతగా మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చూసుకోవాలనే ఉద్దేశంతో పైలట్ ఉద్యోగాన్ని విరమించి ఇంటికే వచ్చేందుకు నిర్ణయించిన సుమీత్, ఆ నిర్ణయాన్ని అమలు చేసేలోపే విషాదం వెంటాడింది.

తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం లేకుండా ఏఐ171 విమానాన్ని నడుపుతున్న సుమీత్ సభర్వాల్ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సుమీత్ మృతికి సహచర పైలట్లు, సిబ్బంది, ఆయన స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read More : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం: PM

One thought on “తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పైలట్

Comments are closed.