ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదని పోలీస్ కమిషనర్ ప్రకటన.

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై నగర పోలీస్ కమిషనర్ సంచలన ప్రకటన చేశారు. ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని స్పష్టం చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆఫీసులు, కాలేజీ హాస్టల్‌లపై విమానం కూలిపోయిన ఘటనలో ప్రయాణికులే కాకుండా, భవనాల్లో ఉన్న స్థానికులు కూడా మరణించే అవకాశముందని తెలిపారు.

ప్రస్తుతం సంఘటన స్థలాన్ని పూర్తిగా మూసివేసి, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాద స్థితిని పరిశీలిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read More : Robbery : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం