పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల వరకు ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు, గాలుల ప్రభావంతో సముద్రం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక మరోవైపు అనుకున్న సమయానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.
Read More : వీవీఆర్ కృష్ణంరాజు జ్యుడీషియల్ రిమాండ్

One thought on “తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు…”
Comments are closed.