బీహార్‌లో ఏడాది పాటు నకిలీ పోలీస్ స్టేషన్…

బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లా మోహిని గ్రామంలో నకిలీ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. గత ఏడాది నుంచి నకిలీ పోలీస్ స్టేషన్‌ను నిర్వహిస్తూ స్థానిక నిరుద్యోగ యువతను మోసగించిన ఘటన శనివారం బయటపడింది.

రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి గ్రామీణ రక్షాదళ్ పేరుతో ఫేక్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించాడు. పోలీస్ ఉద్యోగాల పేరిట యువతను నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.2,500 నుండి రూ.5,000 వరకు వసూలు చేశాడు. వారికి నకిలీ యూనిఫామ్‌లు, లాఠీలు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశాడు.

కేవలం నకిలీ పోస్టింగ్‌లు ఇవ్వడమే కాకుండా, అక్రమ మద్యం రవాణాపై దాడులు చేయించేవాడు. ఆ తరువాత లంచంగా వచ్చిన సొమ్మును సగం వాటా యువతకు ఇవ్వడమంటూ వ్యూహంగా వ్యవహరించాడని బాధితులు తెలిపారు.

ఈ మోసాల విషయం తాజాగా బయటపడటంతో పోలీసులకి శాక్ తగిలింది. నిజమైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించగా, అప్పటికే రాహుల్ పరారైనట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read More : బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కేసులో కొత్త మలుపులు

One thought on “బీహార్‌లో ఏడాది పాటు నకిలీ పోలీస్ స్టేషన్…

Comments are closed.