ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

ఇస్రోకు గౌరవకిరీటాన్ని అందించిన ప్రముఖ శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ (84) మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన కస్తూరి రంగన్, భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి అపారమైన సేవలు అందించారు. ఆయన నేతృత్వంలో ఇస్రో పలు విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించడంతో పాటు భారత అంతరిక్ష పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది.

భారత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన సేవలకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. కస్తూరి రంగన్ మృతిపట్ల దేశవ్యాప్తంగా శోకసంద్రం ఏర్పడింది. శాస్త్రవేత్తల సమాజం, విద్యావేత్తలు, పాలకవర్గాలు ఆయన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

Read More : ద్రౌపది ముర్ము పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలో పాల్గొనాలి