ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం (జూన్ 8) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం సెషన్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్‌లో రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరిగాయి.
ఫలితాలను చూసేందుకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్
👉 https://resultsbie.ap.gov.in/
విజిట్ చేయవచ్చు.
ఫలితాలు తెలుసుకునే విధానం:
- అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ కి వెళ్లాలి.
- హోమ్ పేజీలో ‘AP IPE Results 2025’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత ఇంటర్ 1st Year లేదా 2nd Year ఫలితాలను ఎంచుకోవాలి.
- లాగిన్ విండోలో హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
విద్యార్థులు తమ మార్క్‌షీట్లను భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More : చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభంపై సీఎం ప్రశంసలు.

One thought on “ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు”
Comments are closed.