బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంటλα తారక రామారావు (కేటీఆర్)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరందుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
మూసీ నదీ ప్రక్షాళన ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత ఆత్రం సుగుణ సీరియస్‌గా స్పందించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు కూడా నమోదు చేయించారు.
కేటీఆర్‌కి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టు అతని అభ్యర్థనను సమర్థిస్తూ కేసును కొట్టివేసింది. అయితే, ఆ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ… సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో కేసు తదుపరి విచారణకు వెళ్లింది.

One thought on “మూసీ కుంభకోణం ఆరోపణలపై కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.”
Comments are closed.