ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) ఈ నెల 18 నుంచి 30 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్షలు ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయ సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్న సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. టెట్ పరీక్షలు తెలుగు మరియు ఇంగ్లిష్ మాధ్యమాలలో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ హాల్ టికెట్లు సమయానుసారం డౌన్లోడ్ చేసుకొని, పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరాలని సూచించారు.
Read More : Telangana Formation Day:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ప్రముఖుల శుభాకాంక్షలు

One thought on “జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు”
Comments are closed.