టీడీపీ నేతల హత్యలపై అనుమానాలు : CM

కడప: మహానాడు రెండవ రోజు సందర్భంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తెలుగుదేశం నేతలపై జరిగిన హత్యలను ప్రస్తావిస్తూ, పార్టీకి కోవర్టులు కలుగజేస్తున్న ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు.

తాను ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదని స్పష్టం చేసిన చంద్రబాబు, “ఇటీవల జరిగిన రాజకీయ హత్యలపై నాకు తీవ్ర అనుమానాలు ఉన్నాయి. మన దగ్గరే ఉండే కొందరు కోవర్టులా వ్యవహరిస్తూ, గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారు ఇతరుల ప్రోత్సాహంతో హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు” అని పేర్కొన్నారు.

“మన చేతితో మన కన్ను పొడిచేలా చేస్తున్న ఈ కుట్రలో రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి – టీడీపీని లోపలికే చీల్చి వేయడం, ప్రజల్లో చెడు పేరు తెచ్చేయడం. ఇది నేరస్తుల మాయ. కానీ ఇప్పుడు ఇకనైనా వారందరూ జాగ్రత్త పడాలి. నా దగ్గర ఈ ఆటలు సాగవు” అని ఆయన హెచ్చరించారు.

కోవర్టులను పంపించి తెలుగుదేశం పార్టీలోకి చొప్పించి వారి అజెండాను నెరవేర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుందని స్పష్టంచేశారు. “పార్టీలోకి కొందరు వలస పక్షుల్లా వస్తారు, పోతారు. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. అటువంటి కార్యకర్తలపై నాకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా” అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Read More : మహానాడు డ్రామా.. చంద్రబాబు ఫోజులే తప్ప అభివృద్ధి లేదు.

One thought on “టీడీపీ నేతల హత్యలపై అనుమానాలు : CM

Comments are closed.