తెలుగుదేశం జెండా అంటే తెలుగు జాతికి అండ

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగువారి గౌరవానికి నిలువెత్తు ప్రతీక అని అన్నారు. “తెలుగు ప్రజల అభివృద్ధికి, తెలుగు రాష్ట్రాల ప్రగతికి టీడీపీ నిరంతరం కృషి చేస్తోంది” అని స్పష్టం చేశారు.

పౌరుషాల గడ్డ కడపలో పసుపు జెండా తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈసారి మహానాడు చారిత్రాత్మకంగా జరగుతోందని, పార్టీ భవిష్యత్తు నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీకి మరింత బలంగా మారనుందని అభిప్రాయపడ్డారు.

పార్టీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. వైసీపీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని, మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాలతో ప్రజా సంపద దోచారని జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

“వస్తున్నా మీ కోసం” అన్న మాటలతో చంద్రబాబు ఇచ్చిన భరోసాను గుర్తు చేస్తూ, “యువగళం” యాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజల మనసు గెలిచారని తెలిపారు.

Read More : తెలుగుదేశం కార్యకర్తలకే మాకెన్నటికీ వందనం