రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజమండ్రి – రాజానగరం మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దివాన్ చెరువు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా దూసుకెళ్లి ఎదురుగా ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గల కారణంగా లారీ టైర్ పేలినట్లు స్థానికులు తెలిపారు. టైర్ విఫలమైన సమయంలో లారీ ఒక్కసారిగా దారి మళ్లించగా, అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : తెలుగుదేశం జెండా అంటే తెలుగు జాతికి అండ