బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుతో సంబంధించి నమోదైన కేసులో విచారణ నిమిత్తం ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో భాగంగా ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ యూకే, అమెరికాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. విదేశీ పర్యటన పూర్తయిన వెంటనే విచారణకు హాజరవుతానని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
తనపై వచ్చిన నోటీసులను రాజకీయ వేధింపుల ముసుగులో ఇచ్చినవిగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేవలం 48 గంటల క్రితం ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరు బయటపడిన నేపథ్యంలో, దృష్టి మళ్లించేందుకు ఈ చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినిగా విచారణకు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఏసీబీకి ఇప్పటికే లిఖితపూర్వకంగా తన స్తితిగతులు తెలియజేశానని పేర్కొన్నారు.
Read More : KTR ధీమా, కాంగ్రెస్ పై విమర్శలు

2 thoughts on “ఫార్ములా ఈ కేసు విచారణకు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.”
Comments are closed.