“మోదీ ఓట్లకంటే దేశాభివృద్ధికే ప్రాధాన్యం”

Pawan kalyan

దేశ అభివృద్ధే ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ప్రాధాన్యమని, ఆయన ఓట్ల గురించి ఎప్పుడూ ఆలోచించరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హిమాలయాలు ఎప్పటికీ తలవంచనట్టే, మోదీ కూడా ఎవరికి తలవంచరని ఆయన కొనియాడారు.

ఎన్డీఏ రాష్ట్రాల సమావేశం:
ఢిల్లీకి చెందిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్… అక్కడ ప్రధాని మోదీ విధానాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పీఎం-జన్ మన్ పథకం పై వివరాలు:
“ప్రధానమంత్రి జన్ మన్ పథకం” ద్వారా వెనుకబడిన గిరిజన సమూహాలకు అభివృద్ధి వంతమైన ప్రాజెక్టులు అందిస్తున్నామని పవన్ వివరించారు. కేంద్రం మంజూరు చేసిన రూ.555.61 కోట్లతో 612.72 కిలోమీటర్ల రహదారులు నిర్మించబడుతున్నట్లు చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో 239 పీవీటీజీ గిరిజన గ్రామాలను అనుసంధానించనుంది. దాంతో సుమారు 50,000 మందికి రవాణా సౌకర్యం లభించనుందని వెల్లడించారు.

మోదీ నాయకత్వంపై ప్రశంసలు:
ప్రధాని మోదీ ఓట్లు వచ్చే ప్రాంతాలను కాకుండా, అవసరమున్న ప్రతీ ప్రాంతాన్నీ అభివృద్ధి చేస్తారని పవన్ అన్నారు. “ఆపరేషన్ సిందూర్” వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల భద్రతపై దృష్టిపెట్టి, దేశ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మోదీదేనని అన్నారు.

కుల గణనపై పవన్ అభిప్రాయం:
కులాల జీవన శైలి, వృత్తులు, స్థితిగతులు తెలుసుకోవాలంటే కుల గణన అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అది పాలకులకు స్పష్టతనిస్తూ, తగిన అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు దోహదపడుతుందని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన:
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ తయారు చేసిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఇది మంచి నాయకత్వం లక్షణమని, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలన్నీ ప్రధాని మోదీ స్ఫూర్తితో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read More : ‘మన్ కీ బాత్’లో యోగాంధ్ర ప్రస్తావనపై చంద్రబాబు హర్షం.