కర్ణాటక గ్యాంగ్‌రేప్ కేసు: నిందితులకు ఊరేగింపు

కర్ణాటక హవేరి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరై, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. నిందితులు నవ్వుతూ, విజయ సంకేతాలు చేస్తూ ఊరేగింపు చేపట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో, న్యాయవ్యవస్థపై ప్రజల్లో భద్రతాపై అనేక సందేహాలు మొదలయ్యాయి.

ఘోర ఘటనకు సంబంధించిన నేపథ్యం

ఈ ఘటన 2024 జనవరి 8న హవేరి జిల్లా అక్కి ఆలూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఓ మతాంతర జంట హోటల్ గదిలో ఉంటుండగా, కొందరు వ్యక్తులు అటుగా వచ్చి వారిపై దాడి చేసి, మహిళను అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

నిందితుల అరెస్ట్, బెయిల్ వివరణ

ఈ కేసులో అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మహమ్మద్ సాదిక్ అగసిమని, షోయబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సవికేరి అనే ఏడుగురు ప్రధాన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఇటీవల వీరికి హవేరి సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో వారు బైకులు, కార్లతో ఊరేగింపు నిర్వహించారు.

బాధితురాలి వాంగ్మూలంతో కేసు మలుపు

ఈ కేసును తొలుత మోరల్ పోలీసింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు, జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంతో గ్యాంగ్‌రేప్ సెక్షన్లను చేర్చారు. అయితే విచారణ సమయంలో బాధితురాలు నిందితుల్ని గుర్తించలేకపోవడం వల్ల ప్రాసిక్యూషన్ పక్షానికి బలహీనత ఏర్పడినట్టు తెలుస్తోంది. మొత్తం 19 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పటికే 12 మందికి ముందే బెయిల్ లభించగా, ఇప్పుడు మిగిలిన ఏడుగురికి కూడా విడుదల కలిగింది.

తీవ్ర విమర్శలు

నిందితుల ఊరేగింపు, వారి ఆనందోత్సాహం చూసిన ప్రజలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, న్యాయం ఎక్కడ అనేది ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుపై త్వరితగతిన విచారణ జరిపి, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : Chips : దురదృష్టకరంగా ఆత్మహత్య