ప్రస్తుతం తమిళనాట రాజకీయ, సినీ వర్గాల్లో టాస్మాక్ లిక్కర్ కుంభకోణం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వివాదంలో యువ హీరోయిన్ కయాదు లోహర్ పేరు తెరపైకి రావడంతో కలకలం రేగుతోంది. ఈడీ అధికారులు స్కామ్‌లో సంబంధం ఉన్న వ్యక్తుల నివాసాల్లో దాడులు నిర్వహించగా, కయాదు కూడా అక్కడే ఉన్నట్టు, రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
విశ్వసనీయ వర్గాల ప్రకారం, కయాదు కొంతకాలంగా స్కాంలో భాగస్వాములైన వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని, ఇందుకుగాను ఆమెకు సుమారు 35 లక్షల రూపాయలు అందినట్టు చెబుతున్నారు. ఇటీవల ‘డ్రాగన్’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన ఆమె, తమిళం-తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
నెటిజన్లు ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇది చిత్ర పరిశ్రమ మాయం అవుతున్న సంకేతం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కయాదు లోహర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ ఆరోపణలు ఎంతవరకూ నిజమో త్వరలో తేలనుంది.
Read More : ‘సింగిల్’ సక్సెస్, రవితేజతో ‘అనార్కలి’లో హీరోయిన్గా అవకాశం

One thought on “హీరోయిన్ కయాదు లోహర్ పేరు చర్చల్లోకి”
Comments are closed.