ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్ రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో పరారయ్యారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.

మంటల వల్ల ఆఫీసు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీవ్రంగా కాలిపోవడంతో, ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక డేటా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ కార్యాలయం రాష్ట్రంలోని ఉద్యోగుల జీతాలు, వివిధ శాఖల లావాదేవీల బిల్లులు వంటి కీలక పత్రాలు నిర్వహించే కేంద్రంగా ఉండటునాలుగా, ఈ ప్రమాదం పెద్దదిగా భావిస్తున్నారు. ఇప్పటివరకు అగ్ని కారణంగా జరిగే నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు అని అధికారులు తెలిపారు.

Read More : ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర మాసోత్సవాలు ప్రారంభం

One thought on “ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

Comments are closed.