హైదరాబాద్ మేడిపల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు.

హైదరాబాద్‌ మేడిపల్లి ఆర్‌ఏఆర్ కాలనీలోని సేజ్ పాఠశాలలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం సంబంధిత అధికారుల బృందాలు పోలీసుల బందోబస్తు నడుమ ఆ అక్రమ కట్టడాలను కూల్చివేశాయి.

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని అనుసంధానించే కీలకమైన లింక్ రోడ్డులో పాఠశాల యాజమాన్యం ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టిందని స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఈ ఆక్రమణల కారణంగా రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై కాలనీ వాసులు గత 15 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నట్లు సమాచారం.

ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఆక్రమణలు స్పష్టంగా కనిపించడంతో తక్షణమే చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం అధికారుల బృందాలు అక్రమంగా నిర్మించిన గదులు, గోడలు వంటి నిర్మాణాలను బుల్డోజర్లు సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.

ప్రజల ప్రయాణానికి అడ్డంగా మారిన ఈ అక్రమ నిర్మాణాల తొలగింపుతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఇంకా ఈ తరహా చర్యలు కొనసాగిస్తారని తెలుస్తోంది.

Read More : పెళ్లయిన 48 గంటలలోనే కరెంట్ షాక్‌తో వరుడు మృతి.

One thought on “హైదరాబాద్ మేడిపల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు.

Comments are closed.