హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ మండలంలో మంగళవారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంట్లూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు, ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం, ప్రమాద సమయంలో కారు అధిక వేగంతో ప్రయాణిస్తూ ఒక మలుపు వద్ద డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే హయత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ప్రమాదం స్పష్టంగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్విగ్నతను రేపింది. రహదారులపై వేగమే ప్రాణాలు తీస్తోందని, డ్రైవింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More : గురుకులంలో విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం.
