నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో ఘోరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారి నందినిని ఆమె స్వంత తల్లి ఎల్లమ్మ దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం – ఎల్లమ్మ అనే మహిళ గతంలోనే తన భర్తను హత్య చేసిన నిందితురాలిగా కేసు ఎదుర్కొంది. తాజాగా, మానవత్వాన్ని మంటగలిపేలా – తన ఏడేళ్ల కుమార్తె నందినిని గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామ శివారులో ఉన్న నీటి గుంటలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. గ్రామస్తులు ఈ విషాదకర సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read More : వరంగల్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య.

One thought on “కన్న కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.”
Comments are closed.