హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉద్యోగాల ఆశ చూపించి అనేక నిరుద్యోగుల్ని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. “ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్” అనే సాఫ్ట్వేర్ కంపెనీ.. ఉద్యోగ అవకాశాల పేరుతో ప్రతి ఒక్క నిరుద్యోగి వద్ద రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక చేశామంటూ, ముందు రెండు నెలలు ట్రైనింగ్ నిర్వహిస్తామని చెప్పి కాలయాపన చేసిన ఈ సంస్థ.. అనంతరం నియామక పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అనూహ్యంగా కార్యాలయాన్ని మూసేసి బోర్డు తిప్పేసింది. దాంతో బాధిత నిరుద్యోగులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.
ఇప్పటివరకు దాదాపు 200 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అందించిన సమాచారం ప్రకారం, ట్రైనింగ్ సమయంలో నిరుద్యోగుల సమయాన్ని వృథా చేసిన ఈ కంపెనీ.. మోసపూరితంగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉద్ధేశపూర్వకంగా గమ్యనిర్దేశం లేకుండా మూతపడిందని తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కంపెనీ నిర్వహించిన మోసాన్ని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read More : ఘనంగా ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలు

One thought on “గచ్చిబౌలిలో ఉద్యోగాల పేరుతో మోసం”
Comments are closed.