జాతీయ మహిళా కమిషన్ మండిపాటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కారణమయ్యాయి. భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని వివరిస్తూ సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై అవమానకర వ్యాఖ్యలు చేశారు మంత్రి విజయ్ షా. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ ఉగ్రవాదులు సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారని, వారి మతానికి చెందిన సోదరిని ప్రధాని మోదీ సైనిక విమానంలో పాకిస్థాన్‌కు పంపించి పాఠం నేర్పించిందన్నారు.

ఈ వ్యాఖ్యలపై హైకోర్టు కేసు నమోదు చేసింది. తర్వాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, మంత్రి విజయ్ షాకు ముందుగా హైకోర్టులో క్షమాపణ చెప్పాలని, ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నట్లు గమనించింది.

ఇక జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ వ్యాఖ్యలపై కఠినంగా స్పందించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే మహిళా అధికారుల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేయడం సరి కాదని, సాయుధ బలగాలలో పనిచేసే స్త్రీ అధికారుల గౌరవం పరిరక్షించాలనే ఆవశ్యకతను వెల్లడించింది.

Read more : భద్రతా దళాల కూంబింగ్‌ ఆపరేషన్‌ విజయవంతం.

One thought on “జాతీయ మహిళా కమిషన్ మండిపాటు

Comments are closed.