అహ్మదాబాద్ ఘటనపై ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపాల పర్యవేక్షణలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని డీజీసీఏ పేర్కొంది.

ఈ ఘటన నేపథ్యంలో మూడు మంది సాంకేతిక సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించాల్సిందిగా ఎయిర్ ఇండియాను ఆదేశించింది. వారు విధుల్లో నిర్లక్ష్యం వహించారని, పర్యవేక్షణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని డీజీసీఏ స్పష్టం చేసింది.విమానాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో ఎయిర్ ఇండియా మరింత జాగ్రత్తలు పాటించాలంటూ సూచించింది. ప్రయాణికుల భద్రతతో రాజీ పడే పరిస్థితులను ఏవీ సహించబోమని హెచ్చరించింది.ఈ ఘటనపై పూర్తి నివేదిక త్వరలో అందించాల్సిందిగా కూడా డీజీసీఏ ఎయిర్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది.

Read More : అక్రమ సంబంధం కోసం ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి