మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల దుబాయ్‌లో స్కై డైవింగ్‌కు వెళ్లి సాహసయాత్ర చేసింది. “వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్” అనే క్యాప్షన్‌తో ఆమె తన సాహసోపేత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.
స్కై డైవింగ్ సందర్భంగా, విమానంలో పెద్ద ఎత్తుకు వెళ్లిన ఆమె, అక్కడ తన సహాయకుడి సాయంతో పారాచూట్ వేయించి ధైర్యంగా కిందకి దూకారు. ఈ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసిన తరువాత, అది కాస్తా వైరల్‌గా మారింది.
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తెలుగులో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాతో పాటు, రామ్ పోతినేని సరసన ఒక చిత్రంలో, దుల్కర్ సల్మాన్ ‘కాంత’ చిత్రంలో నటిస్తున్నారు.
Read More : విజయ్ దేవరకొండ “కింగ్డమ్” మూవీ వాయిదా
