భారత క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నారన్న ఊహాగానాలు జోరుగా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న నేపథ్యంలో కోహ్లీ కూడా అదే దారిలో అడుగేస్తున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల ప్రకారం, తన టెస్టు రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ వార్తలు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యతకు చేలేకుంది. జూన్ నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్‌కు ముందు కోహ్లీ తన టెస్టు భవిష్యత్‌పై స్పష్టమైన ప్రకటన చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నారు. అంతకుముందు, కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జడేజా కలిసి టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కి గుడ్‌బై చెబితే, భారత క్రికెట్‌లో ఒక గొప్ప శకం ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా అయితే టెస్టు క్రికెట్‌పై కోహ్లీ ప్రేమకు ముగింపు పలుకుతున్నారా అన్న ప్రశ్న క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
Read More : ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంకు బాంబు బెదిరింపు

One thought on “విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారా?”
Comments are closed.