కేటీఆర్ ప్రెస్ మీట్: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రం ప్రస్తుతం కుదేలు కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలే కారణమని ఆయన ఆరోపించారు.

“నేను ఎక్కడికి వెళ్లినా నన్ను దొంగలా చూస్తున్నారంటాడు సీఎం రేవంత్ రెడ్డి. దొంగను దొంగ అనకుండా ఇంకేం అనాలి?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. “అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించలేకపోవడం దారుణం” అన్నారు. “నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్” అంటూ ఘాటుగా విమర్శించారు.

“రాష్ట్రంలో సర్కారు నడుస్తోందా? లేక సర్కస్ నడుస్తోందా?” అని ఎద్దేవా చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి అప్పుల గణాంకాలపై తప్పుడు లెక్కలు చెప్పుతున్నాడని ఆరోపించారు. “బీఆర్‌ఎస్ హయాంలో మొత్తం అప్పు రూ.4.17 లక్షల కోట్లే. కానీ నువ్వు ఎప్పటికప్పుడు లెక్కలు పెంచుతూ ప్రజలను భయపెడుతున్నావు. ఇది కాకే లెక్క కాదు, కాగ్ లెక్క” అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తున్నా, ఆయన ఖర్చులపై ప్రజలకు ఎలాంటి సమాచారం లేదని కేటీఆర్ ఆరోపించారు. “దమ్ముంటే 43 ప్రయాణాల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు. “ఫోర్త్ సిటీలో 2000 ఎకరాల భూమిని ఎలా కొనుగోలు చేశావు? నీ కుటుంబ సభ్యుల సంపద పెరుగుతుంటే, రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగదు?” అని నిలదీశారు.

ఇంధన ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోస్తున్నారన్న కేటీఆర్, “ధరలు పెంచడం కాదు రేవంత్ రెడ్డి… నీ ఆలోచనలను పెంచు” అంటూ సూచించారు. చివరగా, “కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా” అంటూ హెచ్చరించారు.

Read More : బండి సంజయ్ ఫైర్‌..

One thought on “కేటీఆర్ ప్రెస్ మీట్: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Comments are closed.