అర్జున్ సర్కార్ దూకుడు.. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్!

Nani HIT 3 overseas collections

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 3 ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తోంది. హిట్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్‌లో అత్యుత్తమ ఓవర్సీస్ వసూళ్లను నమోదు చేస్తోంది. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నాని మాస్ అప్పీల్‌తో అదరగొట్టాడు.

సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో హిట్ 3కు మంచి హైప్ ఏర్పడింది. సినిమా విడుదలైన తర్వాత అంచనాలకన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో 2.03 మిలియన్ డాలర్లు రాబట్టడం విశేషం.

హిట్ 3 సినిమాకు ఓవర్సీస్‌లో మొత్తం 2.6 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా, వారం రోజులకే సూపర్ హిట్ లేబుల్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ వంటి ఇతర ప్రాంతాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఫుల్ రన్ లో మరిన్ని రికార్డులు అందుకోవడం ఖాయం అని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నాని తన నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

Read More


One thought on “అర్జున్ సర్కార్ దూకుడు.. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్!

Comments are closed.