ఉపేంద్ర ఆరోగ్యంపై క్లారిటీ.. ఫేక్ న్యూస్‌కు ఫుల్ స్టాప్

Upendra health update

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆరోగ్యం విషయంలో రూమర్లు సోమవారం ఉదయం అభిమానుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి.

అయితే విషయం వెల్లడైన కొద్ది గంటల తర్వాత ఉపేంద్ర డిశ్చార్జ్ అయ్యాడు. ఆయనకు కేవలం ఎసిడిటీ సమస్యలు రావడంతో సాధారణ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్వయంగా ట్వీట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఇది కేవలం రెగ్యులర్ చెకప్ మాత్రమేనని స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉండగా, త్వరలోనే సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నారని తెలుస్తోంది.

Read More


One thought on “ఉపేంద్ర ఆరోగ్యంపై క్లారిటీ.. ఫేక్ న్యూస్‌కు ఫుల్ స్టాప్

Comments are closed.