తప్పుగా చూస్తే తప్పే: మంత్రి జూపల్లి స్పష్టీకరణ

ఈవెంట్‌ పై రాజకీయ కోణంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పడేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ పోటీపై వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని వినిపిస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని స్పష్టం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.
ఈ ఖర్చు కూడా ప్రభుత్వానికి తిరిగి లాభంగా మారుతుందని వివరించారు.

బీఆర్ఎస్ విమర్శలపై మండిపడ్డ మంత్రి

ఫార్ములా ఈ రేసుపై తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, నిబంధనలు ఉల్లంఘించిన ఆర్థిక వ్యవహారాలపై మాత్రమే ప్రశ్నించామని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, రైతులపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. గత పదేళ్ల పాలనలో పంట నష్టపరిహారం ఇచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు. తాము మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులకు సహాయం చేశామని చెప్పారు.

హైదరాబాద్ మిస్ వరల్డ్ కౌంట్‌డౌన్‌లో

మిస్ వరల్డ్ పోటీలు దగ్గరపడుతున్న తరుణంలో హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. విదేశాల నుంచి వచ్చే అతిథులు, కాంటెస్టెంట్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం మిస్ ఫ్రాన్స్ అగథాలో కాయేట్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారుల బృందం సంప్రదాయ పద్ధతిలో ఆమెకు స్వాగతం పలికింది.

పోటీల వేదికలతో పాటు చారిత్రక ప్రాంతాలను కూడా అందంగా ముస్తాబు చేశారు. విమానాశ్రయం, హోటళ్లు వద్ద తెలంగాణ టూరిజం ప్రత్యేకతను ప్రతిబింబించే స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. విదేశీయులకు తెలంగాణ అతిథి సంస్కృతిని పరిచయం చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

One thought on “తప్పుగా చూస్తే తప్పే: మంత్రి జూపల్లి స్పష్టీకరణ

Comments are closed.