హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈసారి గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఆమోదం పొందని భవనాలను కూల్చివేయడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాలులో అక్రమంగా నిర్మించిన మినీ హాల్ మరియు ఫుడ్ కోర్టును కూల్చివేశారు.
కూల్చివేతలను మూడు భారీ బుల్డోజర్లతో చేపట్టిన అధికారులు, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను కూడా తొలగిస్తున్నారు. ఈ కూల్చివేతలకు సంబంధించిన ఆందోళనలను అదుపు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలోని భవనాలను కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో రోడ్లు, పార్కులు మరియు స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత చర్యల్లో భాగంగా సంధ్య కన్వెన్షన్‌లోని అక్రమ నిర్మాణాలను, వంటగదులు, రెస్ట్ రూములు తదితరాలను నిర్మాణాలను నేలమట్టం చేశారు.
Read More : తప్పుగా చూస్తే తప్పే: మంత్రి జూపల్లి స్పష్టీకరణ

2 thoughts on “హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు”
Comments are closed.