సింహాచలంలో గోడ కూలిన ఘటనపై..

సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌ కుమార్‌ నేతృత్వంలో, స్థానికంగా ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ప్రస్తుతం కమిటీ గోడ నిర్మాణానికి సంబంధించిన అంశాలను, క్యూలైన్ ఏర్పాటును, వాస్తవాలను పరిశీలిస్తోంది. ఈ కేసులో మట్టీ శాంపిల్స్‌ను సేకరించి, గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, అనుమతులపై ఆరా తీస్తోంది. టూరిజం శాఖ, దేవాదాయ శాఖ అధికారులు సహకారం గురించి కూడా విచారణ చేపట్టారు. ఈ నివేదికను 72 గంటల్లో సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Read More : వైఎస్ షర్మిల అరెస్ట్…