ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర వ్యాఖ్యలు..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి తరువాత బిహార్‌లోని ఓ ప్ర‌జా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, ఉగ్రవాదులకు శిక్ష విధించేందుకు ఆయన తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిలో అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వారు ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ కష్టసమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తోంది. ప్రభుత్వాలు బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ దాడి వెనుక ఉన్నవారిని ఊహించని విధంగా శిక్షిస్తాం. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, వారిని ఊహించని విధంగా శిక్షిస్తాం. ఈ దాడి దేశంపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది,” అని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా విదేశాల నుండి భారతదేశానికి అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమకు అండగా నిలిచారని, వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

“భారత ఐక్యతను ఉగ్రవాదం బద్దలు కొట్టలేకపోతుంది. ఉగ్రవాదం ఎప్పటికీ శిక్షతో ముగుస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read More : జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు:

One thought on “ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర వ్యాఖ్యలు..

Comments are closed.