కర్ణాటక సీఎం పదవిలో మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు సీఎం సిద్ధరామయ్య తుదిపాటు పెట్టారు. తానే ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పదవిని అప్పగించాల్సిందిగా పార్టీ అధిష్ఠానం తనను అడిగిందన్న వార్తలను ఆయన ఖండించారు. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన సిద్ధరామయ్య, “ముఖ్యమంత్రి పదవిలో పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతాను. ఈ విషయాన్ని జులై 2న డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టంగా చెప్పాను. ఆయన కూడా అప్పుడు ‘కుర్చీ ఖాళీగా లేదు’ అన్నారు” అని గుర్తు చేశారు.
డీకే శివకుమార్‌కు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన ఒప్పుకున్నారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత సీఎంగా మారతారన్న అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
అంతేకాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా స్పందించిన సిద్ధరామయ్య, నిధుల కొరత లేదని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ నాయకులపై రాజకీయంగా ఉపయోగిస్తున్నదని విమర్శించారు.

One thought on “సీఎం పదవి నా దాకే – ఊహాగానాలకు తెరదించిన సిద్ధరామయ్య”
Comments are closed.