యానిమల్‌ మూవీ హిట్‌.. కానీ సమాజానికి హాని?

Animal Movie Criticism

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్‌’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానికి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా విడుదలై ఏడాది గడిచినా కూడా దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ పాత్రల మేకింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ, సందీప్ వంగ మేకింగ్ స్టైల్‌ను కొందరు ప్రశంసించారు. అయితే ఇటీవల జాతీయ అవార్డు గ్రహీత, రచయిత స్వానంద్ కిర్కిరే ‘యానిమల్‌’ సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఆ సినిమా ఎందుకు హిట్ అయిందో, ఎందుకు చూడాలనిపించిందో అర్థం కాలేదు’’ అని అన్నారు.

ఒక యువతి రెండు సార్లు సినిమా చూసినప్పుడు, కారణం అడిగితే ఆమె బాబీ డియోల్ మ్యాన్లీనెస్ కోసం చూశానని చెప్పిందని స్వానంద్ తెలిపారు. ఈ మాటలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని, ఇలాంటి సినిమాల విజయాలు సమాజానికి సానుకూలంగా ఉండవని అభిప్రాయపడ్డారు.

ఇటీవల యానిమల్‌పై పలువురు సీనియర్ నటులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ రచయిత కూడా స్పందించడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. స్వానంద్ వ్యాఖ్యలపై దర్శకుడు సందీప్ వంగ ఎలా స్పందిస్తాడు అనే ఆసక్తి ఇప్పుడు ఉంది.

Read More


One thought on “యానిమల్‌ మూవీ హిట్‌.. కానీ సమాజానికి హాని?

Comments are closed.