బిగ్ బాస్ 9 హోస్ట్ ఎవరు? నాగార్జున లేక విజయ్ దేవరకొండ?

Bigg Boss Telugu Season 9 Host: Nagarjuna or Vijay Deverakonda?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి సిద్ధమవుతోంది. 8 విజయవంతమైన సీజన్ల తర్వాత, ఈ సీజన్‌ను ప్రత్యేకంగా చేయాలని బిగ్ బాస్ బృందం నిర్ణయించింది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్టు సమాచారం. ఈ సారి మొత్తం టాప్ సెలబ్రిటీలతోనే షో నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సీజన్ 9 హోస్ట్‌గా ఎవరు ఉండబోతున్నారు అనే విషయంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కొందరు నాగార్జున కొనసాగుతారని అంటుండగా, మరికొందరు విజయ్ దేవరకొండ హోస్ట్ అవుతారని చెబుతున్నారు.

సీజన్ 3 నుండి 8 వరకూ 5 సీజన్ల పాటు బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌గా నాగార్జున తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన హోస్టింగ్ శైలి ప్రేక్షకులకు ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది యువ హోస్ట్ కావాలని అభిప్రాయపడ్డారు. సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల, నాగార్జున హోస్ట్‌గా ఉంటే మరోసారి బిగ్ బాస్ చూడనని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు పలువురు మాజీ కంటెస్టెంట్లు మాత్రం నాగార్జుననే సరైన హోస్ట్‌గా భావిస్తున్నారు.

హోస్ట్ మార్పుపై ఇంకా స్పష్టత రాకపోయినా, గత సీజన్లలోనూ ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ, చివరికి నాగార్జునే హోస్ట్‌గా కొనసాగడం చూశాం. ఈ సారి నిజంగానే హోస్ట్ మార్పు ఉంటుందా లేదా అన్నది త్వరలో తేలనుంది. విజయ్ దేవరకొండ లేదా రానా దగ్గుబాటి లాంటి యంగ్ హోస్ట్ రావాలనే అభిప్రాయం ఉన్నా, షో నిర్వహణలో వారి సామర్థ్యం గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

Read More

One thought on “బిగ్ బాస్ 9 హోస్ట్ ఎవరు? నాగార్జున లేక విజయ్ దేవరకొండ?

Comments are closed.