బాలీవుడ్ నటి : కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై బాలీవుడ్ నటి కాదాంబరి జెత్వానీపై వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో కోర్టు రిమాండ్ విధించింది. బుధవారం, కోర్టు పీఎస్ఆర్ ను వచ్చే ఈ నెల 7 వరకు రిమాండ్‌కు పంపించాలని తీర్పు వెలువరించింది.

సీఐడీ పోలీసులు పీఎస్ఆర్‌ను అరెస్టు చేసి, బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు చాంబర్‌లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పీఎస్ఆర్, తన లాయర్‌తో కలిసి, తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట వివరణ ఇచ్చారు. జెత్వానీ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తనపై కేసు పెట్టారంటూ వాదించారు. పీఎస్ఆర్, తనపై తప్పుడు కేసు నమోదయ్యిందని, ఈ కేసుకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.

Read More : ఆంజనేయులు అరెస్ట్‌ — కాదంబరి కేసులో కీలక మలుపు, రఘురామ స్పందన