హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ఇటీవల హైదరాబాదుతో అనుబంధం పెంచుకున్నారు. గౌరీ ఖాన్‌తో కలిసి వ్యాపార రంగంలో బిజీగా ఉన్న సుసానే, ఇప్పుడు హైదరాబాదులో తొలి చార్ కోల్ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆకట్టుకున్నారు.
స్టోర్ లాంచ్ అనంతరం, సుసానే, ఆమె సోదరుడు జాయేద్ ఖాన్ లకు రామ్ చరణ్ తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. చరణ్ చూపించిన ప్రేమ, ఆత్మీయతకు మంత్రముగ్ధమైన సుసానే, జాయేద్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్‌ను “రియల్ సూపర్ స్టార్, లెజెండ్”గా కొనియాడారు.

ఇటీవల ముంబై సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటున్న చరణ్, హైదరాబాదుకు వచ్చే ప్రముఖులకు స్వాగతం చెప్పడం, తెలుగు వంటకాల ద్వారా ఆతిథ్యం చూపించడం ఆనందంగా మారింది. మెగా కుటుంబం గతంలో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

చార్ కోల్ స్టోర్ లాంచ్‌లో రామ్ చరణ్‌తో కలిసి సుసానే, జాయేద్ ఖాన్ లతో దిగిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్‌కు సుసానే, జాయేద్ లు కృతజ్ఞతలు తెలిపారు.

One thought on “హైదరాబాదులో సుసానే స్టోర్ లాంచ్.. చరణ్ ప్రత్యేక ఆకర్షణ”
Comments are closed.