బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జన్మదినం సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పురందేశ్వరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — లోక్‌సభలో తన గళాన్ని బలంగా వినిపిస్తూ, ప్రజల సమస్యలను ఢీగా ఉద్ఘాటిస్తున్న ఓ సమర్థవంతమైన నేత పురందేశ్వరేనని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిగా గతంలో పని చేసిన అనుభవం ఆమెకు విశేషంగా కలిసివస్తోందని, ప్రజాపక్షాన్ని నమ్మి రాష్ట్రాభివృద్ధి దిశగా ఆలోచించే నేత అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. పురందేశ్వరి ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని, ఆమె జీవితానికి శుభం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More : టీడీపీ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం
