తెలంగాణలో వడదెబ్బ విరుచుకుపడింది — ఒకేరోజు 9 మంది మృతి!

తెలంగాణలో ఎండల ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బ బారినపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం, కరీంనగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ముగ్గురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, వరంగల్ ప్రాంతంలో మరో ముగ్గురు వడదెబ్బకు గురై మృతి చెందారు.

రోజురోజుకు ఎండలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని తరచుగా తాగాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు.

Read More : బంగారం ధర లక్షకు చేరుకున్నది

2 thoughts on “తెలంగాణలో వడదెబ్బ విరుచుకుపడింది — ఒకేరోజు 9 మంది మృతి!

Comments are closed.