‘ఎలెవన్’ సినిమాకు నితిన్ తండ్రి సపోర్ట్.. బిగ్ రిలీజ్ ఖాయం!

టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర మొదట హీరోగానే సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, తరువాత పలు సపోర్టింగ్ పాత్రలతోనూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నటుడిగా పలు విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ, హీరోగా ఎంపిక చేసుకునే కథల విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇప్పుడు ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “ఎలెవన్” తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

“ఎలెవన్” మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా రూపొందిన ఈ బైలింగ్వల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, హీరో నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి కొనుగోలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ చేస్తుండటం సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

నవీన్ చంద్ర నటనతో పాటు, కథలోని ఇంటెన్స్ మూడ్, మిస్టరీ ఎలిమెంట్స్ “ఎలెవన్” సినిమాను థ్రిల్లర్ ప్రేమికులకు ప్రత్యేక అనుభూతి ఇవ్వబోతున్నాయి. దర్శకుడు లోకేష్ ఏజెల్స్ రూపొందించిన ఈ చిత్రంలో అభిరామి, శశాంక్, రేయా హరి, రవి వర్మ, కీర్తి దామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ ద్వారా సినిమాకు ఉన్న మిస్టరీ ఫీలింగ్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది.

జాతీయ అవార్డు గ్రహీత డి.ఇమ్మాన్ సంగీతం, కార్తిక్ అశోకన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎన్.బీ ఎడిటింగ్ మద్దతుతో “ఎలెవన్” టెక్నికల్‌గా బలంగా నిలిచింది. నవీన్ చంద్రకు ఉన్న ఫాలోయింగ్ కూడా సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని అంచనా. మే 16న థియేటర్లలో విడుదల కాబోయే ఈ థ్రిల్లర్ ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Read More


One thought on “‘ఎలెవన్’ సినిమాకు నితిన్ తండ్రి సపోర్ట్.. బిగ్ రిలీజ్ ఖాయం!

Comments are closed.