ప్రతి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండడం సహజం. అలాంటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఎప్పటికైనా శ్రమిస్తూనే ఉంటారు. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ‘గ్రహణం’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే నేషనల్ అవార్డు గెలిచిన ఆయన, అష్టాచెమ్మా, సమ్మోహనం లాంటి క్లాస్ మూవీలతో తన ప్రతిభను నిరూపించారు.
ఇంద్రగంటి పేరుకు ప్రత్యేకమైన అభిరుచి ఉన్న దర్శకుడిగా గుర్తింపు ఉంది. స్టార్ హీరోలతో కాకుండా చిన్న, మీడియం సినిమాలకే ఎక్కువగా పనిచేసిన ఆయనకు భారీ ప్రాజెక్ట్ తీసేందుకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. ‘జటాయు’ అనే సినిమా కథను సిద్ధం చేసి దిల్ రాజుతో కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అప్డేట్ రావలేదు.
ఇటీవల ‘సారంగపాణి జాతకం’ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇంద్రగంటి, జటాయు ప్రాజెక్ట్ విషయమై స్పందించారు. మొదట జటాయు చేపట్టాలని భావించినప్పటికీ, దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ మూవీకి ఎక్కువ సమయం పడుతుందని తెలియడంతో, మద్యలో మరో సినిమాను పూర్తి చేయాలని సూచించారని చెప్పారు. అలా సారంగపాణి జాతకం ముందుగా వచ్చిందని వెల్లడించారు.
మొత్తానికి, జటాయు ప్రాజెక్ట్ తన డ్రీమ్ అని, తప్పకుండా తానే దర్శకుడిగా తెరకెక్కిస్తానని ఇంద్రగంటి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అందరి చూపు జటాయు మీదే!

One thought on “200 కోట్ల డ్రీమ్: ఇంద్రగంటి ‘జటాయు’కి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు?”
Comments are closed.