స్టార్ హీరో ఎన్టీఆర్, పాన్ ఇండియా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కెజిఎఫ్ సిరీస్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్లతో తన మార్క్‌ను చూపిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు మాస్ మేనియా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెట్స్ మీదకు వెళ్లింది. దీనికి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠను కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా, తారక్ తాజా లుక్ ఫ్యాన్స్‌ను నిజంగా షాక్‌కు గురి చేసింది. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన ఎన్టీఆర్ తన స్లిమ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటివరకు RRR, దేవర సినిమాల్లో మాస్ లుక్‌లో కనిపించిన తారక్, ఇప్పుడు పూర్తిగా సన్నబడిన ఆకృతిలో కనిపించాడు. ఫిట్‌గా, ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండే ఈ లుక్ వెనక ప్రశాంత్ నీల్ గ్లానింగ్ మార్పులు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం తారక్ పూర్తిగా డెడికేట్ అయ్యినట్లు సమాచారం. ‘వార్ 2’ పూర్తి కావడంతో ఇప్పుడు తన పూర్తి సమయాన్ని ప్రశాంత్ నీల్ చిత్రానికి కేటాయించనున్నాడట. ఈ నేపధ్యంలో తారక్ ఇలా స్లిమ్ లుక్‌లో మాస్ విధ్వంసానికి సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ దృష్టిలో ఎన్టీఆర్ కోసం ఏమొక డిఫరెంట్ మాస్ రోల్ ఉండబోతుందని, ఈ మార్పులన్నీ దానికి భాగమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

One thought on “తారక్ స్లిమ్ లుక్ షాక్‌కి గురిచేసిన ఫ్యాన్స్ – ప్రశాంత్ నీల్ మ్యాజిక్ ప్రారంభమైందా?”
Comments are closed.