లాస్ ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్ మరియు స్కాట్లండ్ ఒకే జట్టుగా పాల్గొననున్నాయి. ఈ మేరకు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ ట్రాడీ లిండ్‌బ్లెడ్ ప్రకటించారు. బ్రిటన్‌కు చెందిన అథ్లెట్లు అన్ని విభాగాల్లో “గ్రేట్ బ్రిటన్” జట్టుగా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాడీ లిండ్‌బ్లెడ్ మాట్లాడుతూ, “ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో మా మంచి సంబంధాలు ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి చర్చలు పూర్తయ్యాయి. పురుషుల మరియు మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు తలపడతాయి. జట్టు కూర్పు మరియు ఇతర వివరాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
ఇది దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ఆట ఒలింపిక్స్‌లో తిరిగి ప్రవేశిస్తున్న విషయం. 1900 ఒలింపిక్స్‌లో చివరిసారి క్రికెట్ ఆట జరిగింది, ఇప్పుడు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి లభించనుంది. క్రికెట్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇప్పటికే కార్యాచరణను ఖరారు చేసిందని సమాచారం.
పురుషులు మరియు మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పోటీ చేయనుండగా, ప్రతి జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉంటారు. ఈ పోటీలకు టీ20 ఫార్మాట్‌ను స్వీకరించారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జూన్ 14 నుండి జులై 30 మధ్య నిర్వహించనున్నారు.

2 thoughts on “2028 ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్, స్కాట్లండ్ కలసి బరిలోకి”
Comments are closed.