బంజారాహిల్స్‌లో ఆస్పత్రి భవనంపైకి ఎక్కిన యువతి, పోలీసులు ఘటనా స్థలంలో

బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద ఓ యువతి హల్ చల్ చేసింది. హోటల్ ఎదురుగా ఉన్న ఐదంతుల భవనం పైకి ఎక్కి “దూకేస్తానంటూ” బెదిరింపులకు దిగింది. ఈ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆస్పత్రిగా తెలుస్తోంది, అదే ఆస్పత్రిలో ఆమె పని చేస్తోందని సమాచారం. స్థానికులు తెలిపిన మేరకు, యువతి గంట సేపటి నుంచి ఆవేశంగా ఫోన్ మాట్లాడుతుండగా, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో, బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను కిందకి దింపేందుకు ప్రయత్నించినప్పటికీ, యువతి “నేను దూకేస్తానంటూ” బెదిరింపులకు దిగడంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది.

ఈ సంఘటనతో తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుని, యువతిని ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం, యువతి గురించి, ఆమె భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Read More : కూలి పనికి వెళ్లిన కుమురం భీం మనవడు..

One thought on “బంజారాహిల్స్‌లో ఆస్పత్రి భవనంపైకి ఎక్కిన యువతి, పోలీసులు ఘటనా స్థలంలో

Comments are closed.