కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం దోబే గ్రామానికి చెందిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు కుమురం భీం మనవడు సోనేరావు, తన భార్య గౌరుబాయితో కలిసి దినసరి కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక, జీవనోపాధి కోసం గత 15 రోజులుగా ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేస్తున్నారు.
అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాల సాగుభూమి కేటాయించినప్పటికీ, నివాసానికి తలదాచుకునే ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సోనేరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌లను కలిసి అనేకసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని వాపోయారు.
గతంలో గిరిజన సంప్రదాయ గుస్సాడీ రాజుకు ఇచ్చిన గౌరవం మాదిరిగా, తనను గుర్తించి ఆదుకోవాలని, నెల నెలకు ఆసరా పింఛను మంజూరు చేయాలని సోనేరావు ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు.
Read More : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు తేదీ ఫైనలైజ్డ్..?

One thought on “కూలి పనికి వెళ్లిన కుమురం భీం మనవడు..”
Comments are closed.