కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు.
శనివారం సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ — కేంద్రం కార్మికులను దురుసుగా నిర్లక్ష్యం చేస్తోందని, బీజేపీ సుదీర్ఘకాలంగా కార్మిక వ్యతిరేక పార్టీగానే కొనసాగుతోందని విమర్శించారు. కార్మికుల హక్కులను దెబ్బతీసే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న అధ్వాన్న సేవలను ఉటంకిస్తూ ప్రజలు కాంగ్రెస్ పాలనతో తీవ్ర నిరాశకు లోనయ్యారని విమర్శించారు.
Read More : BRS -BJP గుట్టును బయటపెట్టిన మహేశ్ కుమార్ గౌడ్..

One thought on “సిద్దిపేటలో హరీశ్ రావు కీలక ప్రకటన …”
Comments are closed.