తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి జపాన్ రాజధాని టోక్యో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన, టోక్యోలో నిర్వహించిన భారత్-జపాన్ భాగస్వామ్య రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ మరియు జపాన్ దేశాలు కలిసి ప్రపంచానికి ఒక అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
జపాన్ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి బృందం పలువురు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులపై వివరించారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెప్టివ్ సెంటర్స్ (GCC), ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే, ఈవీ, టెక్స్‌టైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.
Read More : బీజేపీపై దాడికి కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కు — కిషన్ రెడ్డి ఘాటు విమర్శ!
