టీటీడీ EO బంగ్లాలోకి నాగుపాము

టీటీడీ గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు నివసిస్తున్న బంగ్లాలోకి నాగుపాము ప్రవేశించింది. పామును పట్టుకుని గోనె సంచిలో వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి చేతిపై పాము కాటు వేసింది. ప్రస్తుతం, ఈ ఘటనపై భక్తులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము ఎలా వెళ్లింది అనే అంశంపై వివాదాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సంఘటన మరింతగా చర్చలు తెరపైకి తీసుకురావడంతో, టీటీడీ ఆధికారుల నుండి తక్షణ స్పందనలతో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని జనం కోరుకుంటున్నారు.

Read More : భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసుల వద్ద కేసు నమోదు